బండారు దత్తాత్రేయను పరామర్శించిన చిరంజీవి!

  • దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతిపై సంతాపం
  • ఆయన నివాసానికి వెళ్లిన గవర్నర్ విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి, చిరంజీవి
  •  దత్తాత్రేయను ఓదార్చిన వైనం
కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దత్తాత్రేయ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, ప్రముఖ అగ్రహీరో చిరంజీవి ఈరోజు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. సికింద్రాబాద్ లోని రామ్ నగర్ లో ఉన్న దత్తాత్రేయ నివాసానికి వీరు వెళ్లారు. దత్తాత్రేయను, వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. కాగా, వైష్ణవ్ మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గుండెపోటు కారణంగా మంగళవారం రాత్రి మృతి చెందాడు. 
Go Back to Shorts
bandar dattatreya
Chiranjeevi

More Telugu News